telugu navyamedia
సినిమా వార్తలు

‘భార‌తీయుడు 2’ నుంచి సిద్దార్థ్, రకుల్ మెలోడీ విడుదల సాంగ్ రిలీజ్!

క‌మ‌ల్ హాస‌న్‌ .. శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

1996లో క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రూపొందుతోంది.

అభిమానులు, సినీప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూస్తోన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ వేగం పుంజుకున్నాయి.

అందులో భాగంగా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ‘ఇండియ‌న్ 2’ ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘శౌర..’ అనే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్ర‌మంలో బుధ‌వారం మేక‌ర్స్ ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీత సార‌థ్యంలో రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట‌ను అబ్బి, శ్రుతికా స‌ముద్రాల పాడారు.

Related posts