telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాస్క్ పై రంగతమ్మ సీరియస్

Anasuya

టాలీవుడ్ లో ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ రెచ్చిపోతుంది బుల్లితెర బ్యూటీ అనసూయ. అయితే జబర్దస్త్ నుండి పేరు సంపాదించుకున్న అనసూయ రంగస్థలంలో చేసిన రంగమ్మత పాత్రతో అభిమానుల మనసులు దోచుకుంది. ఇక తాజాగా చావు కబురు చల్లగా సినిమాలో కూడా ఓ సాంగ్ లో కనిపంచి ప్రేక్షకులను అలరించింది బ్యూటీ అనసూయ. తాజాగా రంగమ్మత్త మరో స్పెషల్‌ సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ఫేమ్ దర్శకుడు అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే సోషల్ మీడియాలోను త‌న గ్లామ‌ర్ షోతో ఆకట్టుకుంటున్న అనసూయ.. తాజాగా మాస్క్ పై అవగాహన కల్పిస్తూ వీడియో షేర్ చేసింది. కొంతమందికి ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి తెలియదంటూ.. ఆగ్రహించింది. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ జాగ్రత్తలు చెప్పింది. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

https://www.instagram.com/p/COVFVLkDMt1/

Related posts