telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఈవారం బిగ్ బాస్ నుండి అమ్మ ఔట్…?

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 4 చాల రసవత్తరంగా కొనసాగుతుంది. ఇంటి కెప్టెన్‌గా ఎన్నికైన వెంటనే అమ్మ రాజశేఖర్‌‌ హౌజ్‌మెట్స్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇంతకముందు వరకు పిల్లిలా ఉన్న మాస్టర్‌ ఇప్పుడు పులిలా పంజా విసురుతున్నారు. తన మాట శాసనం అనేలా ప్రవర్తిస్తున్నాడు. పనుల విభజనలో భాగంగా తనకు నచ్చని వారికి ఎక్కువ పనులు అప్పజెప్పుతూ, తన స్నేహితులైన అరియానా, మెహబూబ్‌, అవినాష్‌కు చిన్న పనులు చెప్పాడు. ఈ క్రమంలో హౌస్‌లో పెద్ద ర‌భ‌స చోటు చేసుకుంది. అయితే ఈవారం హారిక, మోనాల్, అవినాష్, అభిజిత్ లతో పాటుగా తాను కూడా నామినేషన్ లో ఉన్నాను అనే విషయం మర్చిపోయినట్లు ప్రవరిస్తిస్తున్నారు అమ్మ రాజశేఖర్. బయట ఆయనకు అదే వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తుంది. అందువల్ల ఈ వారం నామినేషన్ లో ఉన్నవారిలో అందరికంటే తక్కువ ఓట్లు ఆయనకే వచ్చాయని… ఈవారం ఎలిమినేట్ అయ్యేది అమ్మ రాజశేఖరే అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts