గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన తాజా చిత్రం “జెర్సీ”. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల అయింది. ఈ చిత్రానికి అశేష ప్రేక్షకాదరణ లభించింది. నాని క్రికెటర్‌గా అదరగొట్టాడని సెలెబ్రిటీలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషించాడు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. సత్యరాజ్, రోనిత్‌కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సను వర్గీస్ పని చేశారు. తాజాగా చిత్రం నుండి “అదేంటో గాని ఉన్నపాటుగా” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటకి అనిరుధ్ సంగీతం అందించడమే కాకుండా ఆలపించడం విశేషం. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. మీరు కూడా ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.
previous post
next post