దేశాధ్యక్ష పదవిలో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి సర్వం సహా చక్రవర్తి కాబోడని అమెరికా ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. అధ్యక్షుడు ట్రంప్ తనపై కొనసాగుతున్న విచారణలో కాంగ్రెస్ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. అధ్యక్షుడు కాంగ్రెస్ విచారణను గౌరవించి తీరాలని, విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చి తీరాలని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జ్ కెటన్జీ బ్రౌన్ జాక్సన్ వైట్‌హౌస్ మాజీ న్యాయసలహాదారు మెక్‌గాన్‌కు స్పష్టం చేశారు.
విచారణకు హాజరయ్యేందుకు చట్టపరమైన సౌకర్యాలను అధ్యక్షుడు వినియోగించుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు. అధ్యక్షుడే నిబంధనలు పాటించకపోతే సామాన్య ప్రజానీకం ఎలా తీసుకుంటుందో కనీస ఆలోచన ఉన్నత పదవిలో ఉన్నవారికి ఉండాలని సూచించింది.