ప్రముఖ హాలీవుడ్ నటి ఆంబర్ హర్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో గురించి. ఆంబర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో ఒకటి పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ఆంబర్ రొమ్ము, నాభి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దాంతో ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయకూడదంటూ ఇన్‌స్టాగ్రామ్ హెచ్చరించింది. అంతేకాదు ఆంబర్ అనుమతి లేకుండా ఆ ఫొటోను తొలగించింది. దాంతో ఆంబర్‌కు ఒళ్లుమండింది. చొక్కాలు విప్పి దిగిన ఫొటోలు హీరోలు పోస్ట్ చేస్తే తప్పు లేదు కానీ ఆడవాళ్లకు మాత్రం ఇలాంటి రూల్స్ ఎందుకు అని మండిపడింది. అంతేకాదు తన ఫొటోను ప్రముఖ హాలీవుడ్ నటుడు జేసన్ మొమోవా ముఖంతో మార్ఫ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తోందని తిట్టిపోసింది. అయితే తనకు జేసన్ పట్ల ఎలాంటి కోపం లేదని ఆంబర్ క్లారిటీ ఇచ్చింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ 2019లో పెడుతున్న స్టుపిడ్ రూల్స్ గురించి నోరు విప్పడానికి అలా ఫొటోను మార్ఫ్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. జేసన్ మొమోవా, ఆంబర్ కలిసి ‘ఆక్వామ్యాన్’ సినిమాలో నటించారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌తో సమస్య ఉంటే నేరుగా అధికారులనే సంప్రదించాలి కానీ ఇలా జేసన్ పరువు తీయడం ఎందుకని పలువురు అభిమానులు ఆంబర్‌పై మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై జేసన్ ఇంకా స్పందించలేదు.
previous post