telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇలియానా కొత్త సినిమా ‘పాగల్ పంతి’ ట్రైలర్

Pagal

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘పాగల్ పంతి’. ఇందులో పుల్కిత్ సమ్రాట్‌, కృతి కర్బంద, అర్షద్ వార్సి, ఊర్వశి రౌతెల, అనిల్ కపూర్ కూడా ఉన్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ మొదట్లోనే పై డిస్‌క్లైమర్‌ను చూపించారు. అంటే ఈ ట్రైలర్ చూసిన వారికి పిచ్చెక్కిపోవడం ఖాయం అని దాని అర్థం. ఈ సినిమా కథ ఏంటంటే.. ఇండియాకు చెందిన కొందరు టూరిస్ట్‌లు విహారయాత్రకు వెళ్తారు. కానీ ఆ ట్రిప్ కాస్తా ఓ మిషన్‌లా మారుతుంది. ఆ మిషన్ ఏంటి? ఈ మిషన్‌ను ఆ పిచ్చి టూరిస్ట్‌లు సక్సెస్ చేశారా? అన్నదే కథ. ‘శనీశ్వరుడు ఇతని వెంటే కాదు ఒడిలో కూర్చనే ఉంటాడు’ అంటూ జాన్ అబ్రహం దరిద్రం గురించి వివరిస్తున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత పుల్కిత్ సమ్రాట్, కృతి కర్బందలు ప్రేమించుకుంటారు. పెళ్లి గురించి మాట్లాడమని కృతి కర్బంద పుల్కిత్‌ను ఇంటికి పిలుస్తుంది. తీరా వెళ్లేసరికి కృతిని తాను అక్క అని పిలుస్తానని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. సినిమా మొత్తంలో వీరు చెప్పే డైలాగులకు అర్థం ఉండదు. కానీ నవ్వులు పూయిస్తాయి అంటున్నారు దర్శకుడు అనీస్. ఈ సినిమా విడుదల అవకుండానే అప్పుడే సీక్వెల్ కూడా వస్తుందని ప్రకటించేశారు దర్శకుడు అనీస్. అప్పటివరకు దేశభక్తి కాన్సెప్ట్‌ ఉన్న సినిమాల్లోనే నటించిన జాన్ అబ్రహం చాలా కాలం తర్వాత ఈ కామెడీ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరైన హిట్లు లేక సతమతమవుతున్న ఇలియానా ఈ సినిమాతోనైనా మంచి విజయం అందుకుంటారో లేదో వేచి చూడాలి. నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ ను వీక్షించండి.

Related posts