telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్‌

“శైలజా కృష్ణమూర్తి” అనే స్పోర్ట్స్ డ్రామాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్యా రాజేష్. ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ తెలుగమ్మాయి తెలుగులో కంటే తమిళంలోనే నటిగా క్రేజ్ సంపాదించుకుంది. “కాక్కముట్టై” చిత్రంతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమలో అందరి దృష్టినీ ఆకర్షించింది నటి ఐశ్వర్యా రాజేష్. అద్భుత నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. జాతీయ అవార్డు పొందిన తమిళ చిత్రం ‘కాక్కా ముట్టై’ చిత్రంలో ఇద్దరు చిన్నారులకు తల్లిగా నటించిన ఐశ్వర్యా రాజేష్‌ తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ భామకు మరో  సువర్ణ అవకాశం వరించింది. హీరో విష్ణు విశాల్ తన సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌కు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ విష్ణువిశాల్ స్టూడియోస్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాకు మోహన్‌దాస్ అనే పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని విష్ణువిశాల్ స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కనుందంట. ఈ అద్భుత చిత్రాన్ని మురళి కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు కావలసిన ఇతర నటీనటులకు ఇంకా ఫైనల్ చేయలేదు. అతి త్వరలోనే ఇతర నటీనటులపై క్లారిటీ వస్తుందంట. అయితే ప్రస్తుతం ఐశ్వర్యా రాజేష్ తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో నాచురల్ స్టార్ సినిమా టక్ జగదీష్‌లో ఐశ్వర్య ఓ పాత్ర చేయనున్నారు. అదేవిధంగా విష్ణువిశాల్ చేతిలో కూడా రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విష్ణువిశాల్ నటించిన కాడన్ సినిమా మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో సినిమా ఎఫ్ఐఆర్ కూడా విడుదలకు సిద్దంగా ఉంది. విష్ణువిశాల్, ఐశ్వర్య జతగా రానున్న సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ జోడీ ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

Related posts