కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో గత రాత్రి ఆయనను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు నెల రోజుల క్రితం కరోనా సోకిన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. 55 ఏళ్ల వయసులో ఉన్న అమిత షా, గత రాత్రి తన ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్ కు తరలించారు.
షా ఆరోగ్యంపై ఎయిమ్స్ వర్గాలు ప్రకటన జారీ చేశాయి. అమిత్ షాను ఆగస్టు 30న డిశ్చార్జి చేశామని, కానీ డిశ్చార్జి సమయంలో డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారని ఈ ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఆయన పూర్తి హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారని వివరించారు. ఆయన ఒకట్రెండు రోజులు ఆయన ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.


ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.. రేపు వైసీపీకీ ఇదే గతి పడుతుంది:కన్నా