సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తన అందంతో, అభినయంతో ఇప్పటికీ మంచి అవకాశాలతో దూసుకెళ్తోంది. ఒకప్పుడు దక్షిణాదిన స్టార్ హీరోలందరితోనూ నటించి అగ్ర కథానాయికగా వెలుగొందిన ఈ బ్యూటీ క్యారెక్టర్ రోల్స్‌కు మారిన తర్వాత కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇటీవల `బాహుబలి`తో ఉత్తరాదిన కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా `ఫైటర్`తో మరోసారి బాలీవుడ్‌ను పలకరించబోతున్నారు. నిజానికి గతంలోనే రమ్యకృష్ణ హీరోయిన్గా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. `క్రిమినల్`, `కల్నాయక్`, `బడేమియా చోటేమియా` వంటి హిందీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత క్రమంగా బాలీవుడ్‌కు దూరమై దక్షిణాది చిత్రాలపైనే దృష్టి సారించారు. దీని గురించి రమ్యకృష్ణ తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ “నేను బాలీవుడ్లో విజయవంతం కాలేకపోయాను. నా చిత్రాలేవీ అక్కడ మంచి ఆదరణ సంపాదించలేకపోయాయి. దాంతో నాకు అక్కడి నుంచి మంచి అవకాశాలు రాలేదు. అందుకే బాలీవుడ్‌కు దూరమయ్యా. దక్షిణాదిన మాత్రం మంచి సినిమాలు చేశాను” అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.
previous post