telugu navyamedia
సినిమా వార్తలు

‘రొమాంటిక్’ ట్రైలర్ విడుద‌ల‌.

పూరీజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి న‌టిస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహింస్తుండ‌గా…డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించారు. ఇక ఆకాశ్ సరసన ముంబాయి బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి రమ్యకృష్ణ కీలక పాత్రలో న‌టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Romantic Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News,  Photos & Videos | Moviekoop

తాజాగా ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ లాంఛ్ చేశాడు.. ట్రైలర్‌ను విడుదల చేసిన డార్లింగ్ చిత్రయూనిట్ కు విషెస్ తెలిపారు. ‘రొమాంటిక్’ కోర‌స్‌ మ్యూజిక్‌తో స్టార్ అయింది టైల‌ర్‌.. ఐ లైక్ దిస్ ఎనిమ‌ల్ అంటూ ఆకాశ్‌పూరీ చెప్తున్న డైలాగ్ కొత్త‌గా ఉంది. ఆడ‌దానితో పెట్టుకుంటే చంక నాకిపోతావు రా..రే.. ఎన్నాళ్ళు నుంచి ఈ ఎఫైర్‌.. నీ లాంటి వాడు కూడా ప్రేమిస్తాడ‌ని నేను ఊహించ‌లేద‌ని..పోలీసాఫీస‌ర్ ర‌మ్య‌కృష్ణ అంటుండ‌గా..నేనింకా ల‌వ్ దాకా పోలేదు మేడ‌మ్..వీక్ అయిపోతాం..ల‌వ్ అంటే పైన్ ఏదైనా తేదా వ‌స్తే ఆడ‌వాళ్లు ఎడుస్తారెమో..మా మాగాళ్ళు ఎక్కి ఎక్కి ఎడుస్తారు అంటూ ఆకాశ్‌పూరీ అదిరిపోయాయి.

Akash Puri's  Romantic: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వదిలిన 'రొమాంటిక్' ట్రైలర్..

ట్రైలర్ చూస్తుంటే ఆకాశ్‌, కేతిక మ‌ధ్య ఎఫైర్ నేప‌థ్యంలో రొమాంటిక్ చిత్రం సాగనున్న‌ట్టు ట్రైలర్‌తో తెలిసిపోతుంది. ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా అనిపిస్తుంది. అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.

Image

దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ .వెల్ల‌డించారు.

Related posts