కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు సెలబ్రిటీలందరూ తగు జాగ్రత్తలు చెబుతూ.. తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నటి మీనా కూడా కరోనా మహమ్మారి గురించి హెచ్చరించారు. “నమస్కారం.. మన ప్రపంచాన్ని పీడిస్తుంది కోవిడ్- 19 కరోనా వైరస్. మన గవర్నమెంట్ ముందు జాగ్రత్తలు తీసుకుని లాక్‌డౌన్ చేసినా, చాలా మంది ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా ఇంకా బయట తిరుగుతున్నారని వింటున్నప్పుడు, టీవీలో చూస్తున్నప్పుడు చాలా భాధగా ఉంది. ఇట్లానే గవర్నమెంట్ చెప్పిన మాట వినకుండా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన పరిస్థితికొచ్చారో మీకు తెలుసా. రోజుకి వేలాదిమందికి ఈ వైరస్ అటాక్ అవుతుంది. వందల్లో జనాలు చనిపోతున్నారు. అమెరికాలో అయితే రెండున్నర లక్షల పైన జనాలకి ఈ వైరస్ అటాక్ అయ్యింది. ఈ పరిస్థితి మనకి వద్దండి. దయచేసి అందరూ గవర్నమెంట్ చెప్పిన మాట వినండి. ఎంతసేపూ ఇంట్లోనే కూర్చోవడం, ఎంతసేపూ టీవీ చూడటం, చాలా బోర్ కొడుతుంది. అదంతా చెప్పకండి. ఇంట్లో పిల్లలుంటే పిల్లలతో ఆడుకోండి, పిల్లలకి చదువు నేర్పించండి. ఇంటి పని, వంట పనుల్లో హెల్ప్ చేయండి. యోగా, మెడిటేషన్, హాబీస్ ఇలా ఎన్నో పనులు చేయవచ్చు. అది మాత్రమే కాదు. ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అద్భుతమైన అవకాశం అందరికీ దొరకదు. జోక్ కాదండీ.. సీరియస్‌గా చెబుతున్నాను. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. దయచేసి అందరూ బాధ్యతగా వ్యవహరించండి. ఇంటిపట్టునే ఉండండి.. సురక్షితంగా ఉండండి..’’ అని మీనా ఈ వీడియోలో పేర్కొన్నారు.
Actress #Meena urges everyone to be responsible and #StayHomeStaySafe #IndiaFightsCorona pic.twitter.com/A8m660URah
— BARaju (@baraju_SuperHit) April 5, 2020