అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగులో ఆచార్యా, హిందీలో ముంబై సాగా, ఇండియన్ 2 లాంటి చిత్రంతో బిజీగా ఉంది. తాజాగా ఆమెకు మరో భారీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. ఇలయదళపతి విజయ్, మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకునట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కాజల్ సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ లో నటించనుందట. కానీ ఆమె పాత్రకు కూడా బాగా ఇంపార్టెన్స్ ఉంటుందట. విజయ్ – మురగదాస్ కలయికలో వచ్చిన ‘తుపాకి’ లో కూడా హీరోయిన్ కాజలే. ఆ సినిమాలో కాజల్ పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. అందుకే ఈసారి కూడా ఆమెనే రిపీట్ చేయాలని మురుగదాస్ భావించాడు. కరోనా అనంతరం జరగబోయే షెడ్యుల్ లో కాజల్ కూడా షూట్ లో పాల్గొంటుందట. ఇకపోతే కాజల్, విజయ్ గతంలో ‘మెర్సల్, జిల్లా’ చిత్రాల్లో కూడా కలిసి నటించడం తెలిసిందే.
previous post
రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా… కేసు నమోదు