డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను ను షేక్ చేస్తుంది.. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగా సినీ హీరో తరుణ్ ను ఈరోజు (బుధవారం) ప్రశ్నించనున్నారు.
మాదకద్రవ్యాల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుటకు నేడు సినీ నటుడు తరుణ్ హాజరుకానున్నారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై , కెల్విన్ తో ఉన్న సంబంధాలు, ఆర్ధిక లావాదేవీల వ్యవహారంలో తరుణ్ ను ఈడీ ప్రశ్నించనున్నారు.
2017 లో ఎక్సైజ్ శాఖ విచారణ ఎదుర్కొన్నాడు తరుణ్. ఈ వ్యవహారంలో ఇప్పటికే దర్శకుడు పూరిజగన్నాథ్ సహా నటులు రానా, రవితేజ, నందు, చార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్, ముమైత్‌ఖాన్, తనీష్, నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ హరిప్రీత్‌సింగ్, డ్రైవర్ శ్రీనివాస్‌ను అధికారులు ప్రశ్నించారు. మత్తు మందు సరఫరాదారులు కెల్విన్, జీషాన్‌లను కూడా విచారించారు. వీరి బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించారు.
విచారణలో భాగంగా తరుణ్ నుండి అధికారులు నమూనాలను సేకరించి FSL కి పంపగా.. ఆ నమునాల్లో డ్రగ్స్ఆనవాళ్లు లేవని FSL రిపోర్ట్ లో తెలిపింది. దీంతో హీరో తరుణ్, డైరెక్టర్ పూరీ కి ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ, ఆర్ధిక లావాదేవీల కారణంగా ఈడీ ఇప్పుడు విచారణ సాగిస్తుంది.దీంతో ఇప్పుడు ఈ కేసులో విచారణ వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.