telugu navyamedia
సామాజిక

అదే ఈ మతం గొప్పతనం ..

హిందూ అనగానే మనువును గుర్తు చేసుకోవద్దు. మనువు పుట్టక ముందే హిందూ మతం వుంది.
నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం. నేను ఆచరించి, పాటించే హిందూ మతం గురించి నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది వేరు. నేనిప్పుడు చూస్తున్నది వేరు.

ఎందరు గజనీలు దండెత్తి వచ్చినా, ఎందరు ఘోరీలు యుద్ధాలు చేసినా హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ హిందూ మత ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. వందల వేల సంవత్సరాలు విదేశీయుల ఏలుబడిలో వున్నా హిందూ మతం చెక్కుచెదరలేదు.
అదీ ఈ మతం గొప్పతనం. అంచేత ఎవరో ఏదో చేస్తారనీ, చేస్తున్నారనీ అనుకోవడంలో సహేతుకత వుందని నేననుకోను.

సాధారణంగా నేను మతపరమైన, కుల పరమైన విషయాలపై వ్యాఖ్యానాలు చేయను. కానీ ఈ మధ్య పదే పదే సామాజిక మాధ్యమాల్లో ఒకరకమైన మొండి ధోరణి కనబడుతోంది. ఇది మన మత విధానాలకే వ్యతిరేకం. హిందూ మతాన్ని మొండిగా సమర్ధించే వాళ్ళలో కనీసం కొందరు కూడా మతం ప్రబోధించిన దాన్ని పాటించడం లేదు.

“సహనావతు” అనేది వేదవాక్యం. . ఆ సహనం ఇవ్వాళ ప్రజల్లో కనబడడం లేదు. ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారనే దానితో మనకు నిమిత్తం లేదు. ఎందుకంటే ఎవరు ఏమి చేసినా ఏమీ కాదు . . జరిగిన చరిత్రే ఇందుకు సజీవ సాక్ష్యం.

నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది.
హిందూ మతం తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా దీనికి పుష్కలంగా వున్నాయి . అందుకు సందేహం అవసరం లేదు.
– భండారు శ్రీనివాసరావు

Related posts