telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొదటిసారి ఆ పాత్రలో త్రిష…?

Trisha

చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం త్రిష తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ తమిళ్ లో సత్తా చాటుతోంది. ఇటీవలే ఈ బ్యూటీ “96” సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం త్రిష, ప్రియమణి ప్రధాన పాత్రల్లో “కుట్రపయిరిచి” అనే తమిళ చిత్రం సెట్స్ పైకి వెళుతోంది. యంగ్ హీరోయిన్ సురభి, సుబ్బరాయలు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో త్రిష పాత్ర గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలిసారిగా ఖాకీ డ్రెస్ లో కనిపించనుందని తెలుస్తుంది. అయితే ఇందులో త్రిష ఓ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తుందా? లేక డైరెక్ట్ పోలీస్ గా కనిపిస్తుందా..? అనేది చూడాలి.

Related posts