మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది. అయితే.. తాజాగా మరో వార్త ఈ సినిమా నుంచి వైరల్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. ఆచార్య సినిమా కోసం కోకాపేటలో టెంపుల్ టౌన్ సెట్ వేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. 20 ఎకరాల్లో దాన్ని నిర్మించారు. మన దేశంలో ఓ సినిమా కోసం అన్ని ఎకరాల్లో అంత భారీ సెట్ వేయడం ఇదే తొలిసారి. దీంతో ఆచార్య మూవీ రిలీజ్ కాకముందే… చిరు తన ఖాతాలో ఓ రికార్డును వేసుకున్నాడు.
previous post