telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ కల ఇప్పటికి నెరవేరింది అంటున్న పాయల్

Payal

తెలుగులో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, ఎక్కువమంది ప్రేక్షకులకు ఆమె తెలుసు. తొలి తెలుగు చిత్రం ‘ఆర్ఎక్స్ 100’, తర్వాత ‘ఆర్‌డిఎక్స్ లవ్’తో గ్లామర్ నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసినప్పటికీ, పాయల్ రాజ్‌పుత్‌ను గ్లామర్ భామగా మెజారిటీ ప్రేక్షకులు చూస్తున్నారు. తాజాగా ఈ భామ తన కల నెరవేరిందంటూ సంబరపడిపోతోంది. తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం తన కల అని, ప్రస్తుతం తెరకెక్కుతున్న ఒక సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పనంటూ సోషల్‌ మీడియా ఖాతాలో ఫోటోలు షేర్‌ చేసింది. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్‌లో పాయల్‌ ‘నరేంద్ర’ అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతుంది. ఈ సినిమాలో పాయల్‌ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.

Related posts