telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నానికి ఆన్లైన్ క్లాసులు… వీడియో వైరల్

Nani

నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల‌వుతుంది. మరోవైపు నాని ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతుంది. అయితే ఆన్లైన్ క్లాసులు త‌న కొడుకు కోసం. త‌న‌యుడు జున్ను కోసం నాని ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజరవుతూ, అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తున్నారు.

 

View this post on Instagram

 

I’m honestly amazed at Junnu’s development and understanding that has grown since we first started our online classes. Initially, I was skeptical about it and I even opted out of this program because I thought – how on earth will he be able to sit through a virtual class? Quite thrilled to say that he has adjusted pretty well and really looks forward to doing his activities with his teacher. He loves to play freeze, shake a shaker to Michael Jackson’s Beat It and enjoys meal prep. Hindi obviously goes above his head but he can perfectly sing his telugu rhymes. This is definitely going way better than I could have ever imagined. Today Nanna joins him because they had planned out an art activity (and I quite suck at anything to do with art) and they are so cute!! The only bummer about this whole thing is that @nameisnani and I can’t get those rhymes out of our head because thumbkin he can sing, thumbkin he can dance 🎶😂 #onlineschooling @anthea.montessori

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) on

కాగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌ క్లాసులకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి 3వ తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహించనున్నారు. ఉదయం 8 నుండి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామంటూ సెప్టెంబర్ 14వ తేదీ వరకు డిజిటల్ తరగతుల షెడ్యూల్ ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఇక 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒక్కో క్లాస్ టైం 30 నిమిషాలు అంత కన్నా తక్కువే.. ఉండే విధంగా ప్లాన్ చేశారు. ప్రతీ విద్యార్థికి క్లాసెస్ రీచ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related posts