మెగా ప్రిన్సెస్ నిహారిక గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహ నిశ్చితార్థం ఆగస్టులో జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ నిహారిక ఎంగేజ్మెంట్ డేట్ను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్మెంట్ జరగనుందని తెలిపారు. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది. వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని నాగబాబు సైతం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
previous post
ఎదవ పుట్టుక… అలా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది : పూరీ