కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఊహించిన సమయం కన్నా ముందుగానే కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశంలో కరోనా వ్యాక్సిన్‌తో పాటు, ఔషధాల తయారీలో కూడా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారని ట్రంప్ చెప్పారు. అమెరికా సైన్యం వ్యాక్సిన్ పంపిణీలో సహకరిస్తుందని చెప్పారు. కరోనా విజృంభణ ఆగట్లేదని అన్నారు.
అమెరికాలో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశముందని ట్రంప్ తమ దేశ ప్రజలకు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్ కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని చెప్పారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు.
ఉల్లి కోసం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి: లోకేశ్