telugu navyamedia
రాజకీయ

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన రాహుల్ గాంధీ..

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్‌ మళ్లీ ఈడీ విచారణకు సోమవారం హాజరయ్యారు. రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ హాజ‌ర‌య్యారు.

ఇప్పటివరకు రాహుల్ గాంధీని సుమారు 30 గంటల పాటు ఈడీ విచారించింది. శుక్ర‌వార‌మే ఈ విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ స‌మ‌న్లు జారీచేసింది.

అయితే శుక్రవారం రాలేనని, రెండు రోజుల తర్వాత (సోమవారం) వస్తానని రాహుల్‌ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి సోనియా గాంధీ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని ఈడీకి తెలిపారు. దీంతో ఈ రోజు రాహుల్ గాంధీ హాజ‌రైయ్యారు.

కాగా..ఈడీ కేంద్ర కార్యాలయంతో పాటు, కాంగ్రెస్ కార్యాలయం ముందు బారికేడ్లతో బందోబస్త్​ను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు.అలాగే ఏఐసీసీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ ఆఫీస్‌లోకి పోలీసులు అనుమతించడంలేదు.

 

Related posts