వెచ్చని బిగింపులలో
కలిసిపోతూ
తనువు తనువు అల్లికలో
మమేకమై హత్తుకుపోతూ
నీ కౌగిలిలో బంధినై
ఉబ్బితబ్బిపోతూ
ఆనందాల పులకింతతో
పులకించిపోతూ
శ్వాసలో శ్వాసనై
లోకాన్ని మరచిపోతూ
నా ఆశాలరూపమై
అంబరాన చిత్రించేనులే
ఇంద్రధనస్సు రంగుల వోలె
-శివేగారి చిన్నికృష్ణ,
పలమనేరు