ప్రస్తుతం సోషల్ మీడియాలో “10 year challenge” వైరల్ గా మారింది. ఈ ఛాలెంజ్ లో భాగంగా పదేళ్ల క్రితం ఫోటోలను, ప్రస్తుత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు సెలెబ్రిటీలై. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోన్స్ పై సోషల్ మీడియాలో ఓ మెమె ప్రత్యక్షమైంది. ఈ విషయంపై గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ తీవ్రంగా మండిపడింది.
అందులో పదేళ్ల క్రితం ప్రియాంక ఓ చిన్నారిని ఎత్తుకోగా, పదేళ్ల తర్వాత పెద్దవాడైన ఆ చిన్నారినే ఆమె పెళ్లిచేసుకున్నట్లుగా అజ్ఞాతవ్యక్తి ఓ మెమెను తాయారు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఈ ఫొటో ఎంత అసహ్యంగా ఉందో చూడండి ? ఈ దేశంలో మగవాళ్లు తమకంటే 25 ఏళ్ల చిన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. ప్రపంచంలోని పలు దేశాల్లో 60 ఏళ్ల వయసు వచ్చినవాళ్లు కూడా చిన్న పిల్లలను పెళ్లి చేసుకున్నా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఓ యువతి తనకంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని పెళ్లిచేసుకుంటే మాత్రం ఇలా అహస్యంగా మెమెలు రూపొందిస్తున్నారు. క్యాజువల్ సెక్సిజం మంచిది కాదు” అంటూ ఫైర్ అయ్యింది చిన్మయి.
Anyone see how mean this meme is?
This is a country where men marry women 25 years their junior, elsewhere in the world 60 year olds marry children and no one bats an eyelid. A woman marries someone younger and it is a meme in a 10 year challenge.Casual sexism ain’t cool. pic.twitter.com/OrcZ83Q5T5
— Chinmayi Sripaada (@Chinmayi) January 18, 2019
సుశాంత్ ను రియా వేధించింది… అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు