telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా కెరీర్ లోనే బెస్ట్ సినిమా “ఫైటర్” కానుంది : పూరీ జగన్నాథ్

Fighter

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో “ఫైటర్” అనే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ తో పాటూ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌రోనా ఎఫెక్ట్‌తో షూటింగ్ ఆగింది. అయితే ఫైటర్ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని పూరిజగన్నాథ్ ట్విట్టర్ లోపేర్కొన్నారు. ఈ సినిమా టైటిల్ కు తగినట్టుగా విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాను పూరి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో విజయ్ తో తలపడటానికి కండల వీరుడు మైక్ టైసన్ ను రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక ఏకంగా హాలీవుడ్ సినిమాల్లో నటించిన మైక్ టైసన్ నే రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తున్నాడంటే సినిమాపై పూరి ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

Related posts