దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఇక ఈ కాలం నాటి అందాల భామలు గ్లామర్, నటనతోనే కాదు వర్కవుట్స్తోను అభిమానులని ఫిదా చేస్తున్నారు. తాజాగా తమన్నా త్రో బ్యాక్ వీడియోని షేర్ చేస్తూ అందరు నోరెళ్ల పెట్టేలా చేసింది. ట్రైనర్ సమక్షంలో తమన్నా చేసిన ఫీట్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ‘ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్’ మీకు అందిస్తున్నాను. మోచేతులు, తలని బ్యాలెన్స్ చేస్తూ హెడ్‌ని ఖచ్చితంగా స్టాండ్ చేసే ప్రయత్నాలలో ఇది ఒకటి అని తమన్నా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో షేర్ చేసింది. ట్రైనర్ సమక్షంలోనే ఇలాంటి ఫీట్స్ చేయాలని అమ్మడు నెటిజన్స్‌కి స్పష్టం చేసింది. అయితే తలపై బాడీని మొత్తం బ్యాలెన్స్ చేస్తూ తమన్నా చేసిన వర్కవుట్‌ని చూసి ఫిదా అవుతున్నారు.
previous post