telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఛాలెంజ్ పూర్తి చేసిన మెగాస్టార్… రజినీ, కేటీఆర్‌లకు ఛాలెంజ్

chiru

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ స్టార్‌ చేసిన ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. సందీప్‌ వంగ మొదటగా ‘బి ది రియల్ మెన్ ఛాలెంజ్’ రాజమౌళికి విసిరాడు. దీంతో రాజమౌళి తన ఇల్లు శుభ్రం చేయడం.. ఇల్లు కడగడం లాంటీవి చేసి తారక్‌ను చరణ్‌ను నామినేట్ చేశాడు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా తారక్ ఇంటి పనులు చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయగా తాజాగా చరణ్ కూడా చెట్లకు నీరు పోయడం, బట్టల్నీ వాషింగ్ మిషిన్‌లో వేయడమే కాకుండా తన సతీమణి ఉపాసనకు చక్కగా ఓ కాఫీ కలిపి ఇచ్చాడు. ‘బీ ది రియల్ మెన్ ఛాలెంజ్‌లో భాగంగా బాబాయి బాలయ్యతో పాటు చిరంజీవి, వెంకటేష్. నాగార్జునతో కొరటాల శివకు నామినేట్ చేసారు. ఇందులో కొరటాల శివ ఇప్పటికే తన ఇంట్లో పనులు చేసారు. తాజాగా చిరంజీవి కూడా ఇంటిని వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసి తన తల్లి గారైన అంజనమ్మకు ఇంట్లో దోష చేసి పెట్టి కొడుకుగా తల్లిపై తన ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు బి ది రియల్ మెన్ ఛాలెంజ్‌ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను నామినేట్ చేసారు.

Related posts