నేడు శంషాబాద్ ముచ్చింతల్ లో స్వర్ణభారతి ట్రస్ట్ రెండవ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలోనే చెప్పుకోదగ్గ పది ట్రస్టులలో స్వర్ణభారత్ ఒకటని అన్నారు. నెల్లూరులో 80వేల మంది ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. యువకులు కష్టించి పనిచేస్తే భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. నేను కష్టపడ్డాను కాబట్టే ఇవాళ అత్యున్నత పదవిలో ఉండగలిగాను అన్నారు.
వ్యవసాయంలో గుణాత్మకమైన మార్పులు చాలా అవసరం. అన్నదాతలు ఆర్థికంగా విజయం సాదించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి భాష, సంస్కృతిని ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు ఉపరాష్ట్రపతి.
video source : Ntv


అప్పులన్నీ తమపైకి నెట్టి.. టీడీపీ విమర్శలకు దిగుతోంది: మంత్రి బుగ్గన