ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరో హీరోయిన్లు రకరకాల పోస్టులతో ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే, ఆరోగ్య సూత్రాలను కూడా సూచిస్తున్నారు. లాక్ డౌన్ ఈ సమయంలో తాము ఇళ్లలో ఏం చేస్తున్నామో చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్ 70 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్ను కాపాడుకోవడానికి వర్కౌట్స్ చేస్తున్నారు. ఇంట్లో రాకేష్ రోషన్ వర్కౌట్స్ చేస్తో్న్న వీడియోను ఆయన కుమారుడు, హృతిక్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఎప్పటికీ ఆయన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోరు. ఇలాంటి దృఢ సంకల్పం మనందరం ఇలాంటి సమయంలో పోరాడటానికి అవసరం.ఈ ఏడాది ఆయన 71వ సంత్సరంలోకి అడుగుపెడతారు. రోజుకి రెండు గంటల పాటు ఆయన వ్యాయామం చేస్తారు. కిందటేడాది ఆయన క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడ్డారు. వైరస్ కూడా ఆయన్ని చూసి భయపడుతుందని నేను భావిస్తున్నాను. చాలా చాలా భయపడుతుంది అని హృతిక్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. రాకేష్ రోషన్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు. కుమారుడు హృతిక్ రోషన్‌తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి అతన్ని బాలీవుడ్లో సూపర్ స్టార్‌ని చేశారు.
previous post