హీరోయిన్గా పెద్దగా రాణించలేకపోయిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా బిజీ అయిపోయారు. దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘సర్కార్’ సినిమాలో లేడీ విలన్‌గా వరలక్ష్మి నటన ఆకట్టుకుంది. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె ‘క్రాక్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ఇప్పటికే చాలా మంది నటీమణులు స్పందించారు. వీళ్లలో తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా ఉన్నారు. ‘మీటూ’ ఉద్యమానికి సపోర్ట్ చేసిన కొంత మంది నటీమణుల్లో ఈమె ఒకరు. మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పేయడం తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్టైల్. వరలక్ష్మి నటించిన `వెల్వెట్ నగరం` సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన వరలక్ష్మి తన తండ్రి భార్య, నటి రాధిక గురించి మాట్లాడింది. `నా తండ్రి శరత్‌కుమార్ భార్య రాధికను `ఆంటీ` అని పిలవడం గురించి నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఆమె నా తల్లి కాదు. ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారు. నాకూ ఒక్కరే. ఆమె నా తండ్రి రెండో భార్య. అందుకే ఆమెను ఆంటీ అని పిలుస్తా. అయితే ఆమెను నా తండ్రితో సమానంగా గౌరవిస్తాన`ని వరలక్ష్మి చెప్పింది.
previous post


నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా