బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే. తాజాగా ఆయన తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్స్ కోసం గృహ నిర్మాణానికి రూ.కోటిన్నర నగదును విరాళంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌తో కలిసి ఆదివారం ట్రాన్స్‌జెండర్స్‌కు బహుకరించారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్లో ఫోస్ట్ చేశారు. ట్రాన్స్జెండర్లకు గృహ నిర్మాణం కోసం ఓ హీరో ఇంత పెద్దమొత్తంలో విరాళం ప్రకటించడం దేశంలోనే తొలిసారని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అక్షయ్ లారెన్స్ దర్శకత్వం వహిస్తోన్న ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో లారెన్స్ ట్రాన్స్జెండర్ల కోసం చెన్నైలో ఓ భవనాన్ని నిర్మిస్తున్నట్లు అక్షయ్ తెలుసుకున్నారు. ఇంత మంచిపనిలో తాను కూడా భాగం అవ్వాలనుకున్న అక్షయ్ భారీ విరాళాన్ని ప్రకటించారు.
previous post
యువతితో డైరెక్టర్ బూతు చాటింగ్… అసలు జరిగిన కథ ఇదీ…!