సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం కృషిచేయాలని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. ఈ రోజు సూర్యాపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో మంత్రి భేటీ అయ్యారు. త్వరలో జరుగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
దేశ రాజకీయ చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ సృష్టించిన రికార్డులను ఎవరూ కూడా అధిగమించలేరని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులం అనేది ఆధారం కావాలంటూ.. వ్యతిరేకం కాకూడదని చెప్పారు. పరిధులు మీరితే ఎంతటివారయినా కూడా చర్యలు తీసుకుంటా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలవైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.


శాసన మండలిని రద్దు చేయడం జగన్ వల్ల కాదు: యనమల