telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీవో నెం.13పై ఏపీ హైకోర్టులో పిటిషన్!

ap high court

ఏపీ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కర్నూలుకు కార్యాలయాల తరలింపునకు సంబంధించిన జీవో నెం.13ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవో చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను రైతుల తరఫు న్యాయవాది కర్మంచి మణి ఇంద్రానిల్ బాబు దాఖలు చేశారు.

ప్రభుత్వంతో పాటు సీఆర్డీఏను, సీఆర్డీఏ చైర్మన్ ను ప్రతివాదులుగా చేర్చినట్టు, దీనిపై రేపు విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఏపీ విజిలెన్స్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ చైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జీవో నెం.13 ఇటీవల విడుదలైంది.

Related posts