సీఏఏ, జేఎన్యూ ఘటన విషయాల్లో ప్రతిపక్షాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జనజాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో యోగి మాట్లాడుతూ.. దేశంలో హింసాత్మక వాతావరణానికి వామపక్ష పార్టీలే కారణమని ఆరోపించారు.
ఢిల్లీ జేఎన్యూలో పరీక్షలకు అంతరాయం కలిగించేందుకే వారు ఇలాంటి కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఫలితంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ఇలాంటి చర్యలతో దేశంలో ముగింపు దశలో ఉన్న ఉగ్రవాదం, వేర్పాటువాదం మళ్లీ పురుడుపోసుకుంటున్నాయని యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

