telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ సినిమా స్టంట్లు చేయాలని చూస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి

srinivasa rao minister

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శనాస్త్రాలు సంధించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ లో పర్యటించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కు తమను విమర్శించే నైతికహక్కు లేదని అన్నారు.

రాజధానిలో సినిమా స్టంట్లు చేయాలని పవన్ చూస్తున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సినిమాల్లో పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లా ఉండొచ్చు కానీ, ఇక్కడ మాత్రం ‘రబ్బర్ సింగ్’ అని ఎద్దేవా చేశారు.
పక్క రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు దీక్షలు చేస్తే మద్దతు తెలిపే పవన్, ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం జగన్ ని అభినందించలేకపోయారని విమర్శించారు.

Related posts