క్యూబా పార్లమెంట్ కొత్త ప్రధానిగా ఆ దేశ పర్యాటక శాఖ మాజీ మంత్రి మాన్యుయెల్ మరెరోను ఎన్నుకుంది. రానున్న ఐదేళ్ల కాలానికి ఆయన క్యూబా ప్రభుత్వ సారధిగా వ్యవహరిస్తారు. గత ఏప్రిల్ నుండి అమలులోకి వచ్చిన కొత్త రాజ్యాంగ నిబంధనల మేరకు ప్రధానిగా మరెరో పేరును అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ ప్రతిపాదించారు. ఈ సందర్బంగా దేశ పర్యాటక రంగానికి మరెరో చేసిన సేవలను, ఆయన నిజాయితీ, అంకిత భావాలను అధ్యక్షుడు కానెల్ ప్రశంసించారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన మరెరొ పార్లమెంట్ సభ్యుడిగా ప్రధాని పదవికి రాజ్యాంగం నిర్దేశించిన అర్హతలన్నీ కలిగి వున్నారు. క్యూబా విప్లవనేత ఫైడల కాస్ట్రో 1959 ఫిబ్రవరి నుండి 1976 డిసెంబర్ వరకూ ఈ పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే.
							previous post
						
						
					
							next post
						
						
					


భ్రమలో ఉంటే కుదరదు టీడీపీ ఓటమి పై ..అశోక్ గజపతిరాజు హెచ్చరిక