క్రిస్మస్ వేడుక సందర్భంగా బడా హీరోలు మంచి సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న సాయిధరమ్ తేజ్ నటించిన “ప్రతిరోజూ పండగే”, బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “రూలర్” చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ చిత్రాలు కార్తీ , జ్యోతికల “దొంగ”, సల్మాన్ ఖాన్ “దబాంగ్ 3” చిత్రం తెలుగు ప్రేక్షకులని పలకరించనున్నాయి. ఈ సినిమాలన్నింటిపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొని ఉండగా, ఏ సినిమా ప్రేక్షకులని ఎక్కువగా అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక డిసెంబర్ 25న రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “ఇద్దరి లోకం ఒకటే”, కీరవాణి చిన్న తనయుడు శ్రీ సింహా నటించిన “మత్తు వదలరా” చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఈ నెలలో ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులని అలరించనున్నాయి. డిసెంబర్ 13న విడుదలైన “వెంకీ మామ” చిత్రంకి మంచి టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబడుతుంది.
							previous post
						
						
					
							next post
						
						
					

