telugu navyamedia
సినిమా వార్తలు

ఇప్ప‌టికీ అంతే ప్రేమ‌ను ఫీలవుతున్నా : అల్లు అర్జున్

Arya

అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్‌గా ఎద‌గ‌డంలో ముఖ్య పాత్ర పోషించిన చిత్రం “ఆర్య”. “గంగోత్రి” త‌ర్వాత బ‌న్నీ చేసిన ఈ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. “ఫీల్ మై ల‌వ్‌” అంటూ ఆ సినిమాలో బన్నీ చేసిన సందడికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతోనే హీరోగా బ‌న్నీ, డైరెక్ట‌ర్‌గా సుకుమార్‌, నిర్మాత‌గా దిల్ రాజు అంద‌రి దృష్టిలో పడ్డారు. ఈ సినిమా విడుద‌లై నేటికి ప‌దిహేనేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. “ఇప్ప‌టికీ నేను అంతే ప్రేమ‌ను ఫీలవుతున్నా. నా జీవితంలో `ఆర్య‌` ఓ మేజిక‌ల్ మూవీ. ఈ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. `ఆర్య‌` విడుద‌లై ప‌దిహేనేళ్లు పూర్త‌వుతున్నాయంటే న‌మ్మ‌లేక‌పోతున్నా. దిల్ రాజు, సుకుమార్‌, దేవిశ్రీప్ర‌సాద్‌, ర‌త్న‌వేలు.. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. న‌న్ను ఎంత‌గానో ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు పేరుపేరునా కృతజ్ఞతలు” అని బ‌న్నీ పేర్కొన్నాడు. అంతేకాదు “ఆర్య‌” పోస్టర్‌ను కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు.

Related posts