telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అయోధ్య వివాదంపై కాంట్రవర్సీ క్వీన్ మూవీ

KAngana-Ranauth

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కాంట్ర‌వ‌ర్సీస్‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. ఈ బాల్యేఊద్ ఫైర్ బ్రాండ్ నటనతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. పలు వైవిధ్యమైన చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఏ విషయమైనా ఏ మాత్రం సిగ్గు పడకుండా బయటకు చెప్పేస్తుంది. కంగనా ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే. ఆమె నోటికి బాలీవుడ్‌లో మహామహులే భయపడుతుంటారు. అంతగా వివాదాల్లో మునిగి తేలుతుంటారు కంగనా. ఇదిలా ఉండగా… ఇప్పుడు ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గానూ అవతారమెత్తింది. ‘మణికర్ణిక’ పేరుతో కంగనా తన ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి, త్వరలోనే కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ‘రామ జన్మభూమి’ ఉదంతం ఆధారంగా నిర్మించనున్న ఈ సినిమాకు ‘అపరాజిత అయోధ్య’ అనే పేరు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంగనా సోదరి రంగోలి తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నదని, ప్రస్తుతం ఈ సినిమా స్టార్ కాస్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలిపింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ సినిమాను నిర్మించనున్నట్లు రంగోలీ తెలిపింది.

Related posts