పోటీ పరీక్షలకు గైర్హాజరైనందుకు తండ్రి మందలించారనే మనస్తాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. జనార్ధన్ హిల్స్‌లో నివాసముంటున్న చరణ్‌రాజ్ అనే యువకుడు నిన్న రాత్రి భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు ఈ రోజు మృతి చెందాడు. పరీక్షలకు గైర్హాజరైనందుకు తండ్రి మందలించారనే మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. మృతుడు అనంతపురం జేఎన్టీయూలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మాదాపూర్‌లో ఓ ఇనిస్టిట్యూట్‌లో చరణ్‌రాజ్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

