గూగుల్ పబ్ జీ గేమ్ ఐటమ్స్ కొనుగోలు చేసేవారికి డిస్కౌంట్ కూపన్ అందిస్తోంది. ఒక్కో ఆర్డర్ పై రూ.200 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ మెయిన్ మెనూలో లేదా రివార్డ్స్ విభాగం లోపల అందుబాటులో ఉంది. ఈ కూపన్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లభ్యమైన తర్వాత గేమ్ ఇన్ సైడ్ లోనూ లభ్యమవుతుంది. పబ్జీ మొబైల్ ప్లేయర్స్ ఏదైనా గేమ్ కొనుగోలు చేయడానికి రూ. 200 కూపన్ క్రెడిట్ ఉపయోగించవచ్చు. ఈ బోనస్ కూపన్ పొందటానికి ప్లేయర్స్ కనీసం గేమ్ కు సంబంధించి ఐటమ్స్ లో కనీసం రూ.350 విలువైన ఐటమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో రూ.350 నుంచి వచ్చే UC పాయింట్లతో చీపెస్ట్ ఐటమ్ ఏదైనా కొనొచ్చు. దీనిపై రూ.200 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది.
గూగుల్ లేదా టెన్సెంట్ తమ ఆటగాళ్లకు రూ .200 ప్రోమోను ఎప్పుడు అందిస్తుందో ప్రకటించలేదు. లిమిటెడ్ పిరియడ్ మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ కూపన్ ఏదైనా సీజన్ 10 కంటెంట్ కు మాత్రమే వర్తిస్తుంది. సీజన్ 10 అప్ డేట్ ద్వారా మరిన్ని అదనపు కొత్త ఫీచర్లు తీసుకోస్తోంది.ఈ వర్సెన్ లో థీమ్ బంజర్ భూమి రూపాన్ని కలిగి ఉంటుంది. దీని పేరు ఫ్యూరీ ఆఫ్ దీ వెస్ట్ ల్యాండ్స్ (Fury of the Wastelands)అనే పేరు పెట్టారు. గేమ్ లో టీం డెత్‌మ్యాచ్ మోడ్ (టిడిఎమ్) కోసం కొత్త మ్యాప్‌ను జోడించింది, దీనిని రూయిన్స్ అని పిలుస్తారు. కొత్త మ్యాప్ దట్టమైన వృక్ష సంపద, వివిధ మార్గాల చిట్టడవితో సెట్ చేయబడింది. గేమర్స్ కు మరింత సరదాగా చేయడానికి ఆట వికెండి మ్యాప్ లోపల కొత్త తుపాకీతో పాటు వాహనాన్ని కూడా జోడించింది.