ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు ప్రతి ఏడాది గోవాలో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పలు చిత్రాల ప్రదర్శనతో పాటు కొందరు ప్రముఖులని అవార్డులతో సత్కరించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 20 నుండి 28వరకు 50వ ఇఫి వేడుకలు గోవాలో ఘనంగా జరగనున్నాయి. ఇందులో 250కి పైగా సినిమాలు ప్రదర్శన జరుపుకోనున్నాయి.. ఈ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ని గోల్డెన్ జూబ్లీ అవార్డ్‌తో సత్కరించనున్నారు. ఈ విషయాన్ని బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్ కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. తనకి ఈ ప్రతిష్టాత్మక గౌరవం అందించినందుకు రజనీకాంత్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిజేశారు. కాగా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రెంచ్ యాక్టర్ ఇసాబెల్లె హప్పర్ట్కి అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
In recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant.
IFFIGoa50 pic.twitter.com/oqjTGvcrvE— Prakash Javadekar (@PrakashJavdekar) 2 November 2019
ఆ హీరో కూడా డ్రగ్స్ తీసుకునేవాడు… సీనియర్ హీరోయిన్ కామెంట్స్