కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు కేరళ సీఎం పినరయి విజయన్ను కలిశారు. కొచ్చిన్ హౌజ్‌లో సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇటీవల కేరళలో సంభవించిన భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయ, పునరావాస చర్యల గురించి ఉభయులూ చర్చించారు.నేషనల్ హైవే 766 వెంబడి అటవీ ప్రాంతంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ను నిషేధించాలన్న అంశం గురించి ఇద్దరూ చర్చించారు. సుహృద్భావపూరిత వాతావరణంలో తమ సమావేశం జరిగినట్టు తెలిపారు.
next post
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్