telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు దుర్మరణం

Accident

రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. గావాలోకి ధానీ నుంచి పులేరా వెళుతున్న ఆటోను జైపూర్‌కు సమీపంలోని జోబ్నర్ ఎస్‌కేఎన్ అగ్రికల్చరల్ కాలేజీ వద్ద ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.

Related posts