telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ లో భారీ వర్షం.. విడతల వారీగా ఉద్యోగులు ఇంటికెళ్లాలి

huge rain in hyderabad troubles normal life

 హైదరాబాద్  లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయమేర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడింది. ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అరగంట ముందే చీకట్లు అలుముకున్నాయి. విడతల వారీగా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు రంగంలోకి దిగారు.

Related posts