“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా విడుదలైన “సాహో” ట్రైలర్ సినిమా పై అంచనాలని భారీగా పెంచేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్, శ్రద్ధా కపూర్ల రొమాన్స్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయబోతున్నట్టు తాజాగా విడుదలైన ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది. టేకింగ్, ప్రభాస్ నటన, యాక్షన్ పార్ట్, హై టెక్నికల్ వేల్యూస్ అద్భుతంగా ఉన్నాయంటూ అందరూ ట్రైలర్‌ని ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఈ ట్రైలర్‌పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సృష్టిస్తోంది. కాగా లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన వార్తొకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. అసలు సినిమాలో ప్రభాస్ పేరేంటి? అనే ప్రశ్న వేస్తే టైటిల్లో ఉన్నట్లు సాహో కాదా? అనే సమాధానం ఎక్కువగా రావచ్చు. కానీ `సాహో`లో ప్రభాస్ పేరు క్రాక్ అయ్యింది. ప్రభాస్ పేరు అశోక చక్రవర్తి. అండర్ కవర్ కాప్‌గా ప్రభాస్ కనిపించబోతున్నారు. ట్రైలర్‌ని చూస్తే ఓ సీన్లో ప్రభాస్ ఫొటోను గమనిస్తే.. అందులో తన పేరుని అశోక చక్రవర్తి అని ఉంటుంది. ఇదే పేరుతో 30 ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ సినిమా కూడా చేశారు. తర్వాత ఆ పేరుని పూర్తిగా ఎక్కడా ఉపయోగించలేదు. ఇప్పుడు ప్రభాస్ ఆ పేరుని పూర్తిగా వాడుకున్నట్లు తెలుస్తుంది.
previous post