2018లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో గూఢచారి, చిలసౌ ఉన్నాయి. 2018 ఆగస్ట్ 3న విడుదలైన ఈ చిత్రాలు నేటితో ఏడాది పూర్తి చేసుకున్నాయి. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందిన చిత్రం “గూఢచారి”. ఈ చిత్రంలో అడవి శేష్, శోభిత ధూలిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాశ్ రాజ్ కీలకపాత్ర పోషించారు శశికిరణ్ తిక్కా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతోనే వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన గూఢచారి సినిమాకి ప్రముఖ ఇంటర్నెట్ డేటా బేస్ (ఐఎండిబి) సంస్థ పదికి 9.1 రేటింగ్ ఇచ్చింది. గతంలో అతి కొద్ది సినిమాలకి మాత్రమే ఆ సంస్థ ఇలా రేటింగ్ ఇచ్చింది.
ఇక రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన “చి.ల.సౌ” సినిమాకి 9 రేటింగ్ ఇచ్చారు ఐఎండిబి. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ ప్రధాన పాత్రలో అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం “చి.ల.సౌ.”. రుహని శర్మ చి.ల.సౌ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. సుశాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించారు.
మంచు లక్ష్మి బీర్ తాగుతూ రోడ్డులో… బిడ్డను కనడానికి కూడా ఇబ్బందే పాపం… రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు