telugu navyamedia
సినిమా వార్తలు

పాయల్ రాజ్ పుత్ “ఆర్‌డీఎక్స్ లవ్” ఫస్ట్ లుక్

RDX

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ ప్ర‌స్తుతం “ఆర్‌డీఎక్స్ లవ్” అనే చిత్రం చేస్తుంది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నాయిక ప్రాధాన్య‌త ఉన్న చిత్రంగా ఉంటుంద‌ని స‌మాచారం. తాజాగా చిత్ర ఫ‌స్ట్‌లుక్ వెంక‌టేష్ చేతుల మీదుగా విడుద‌లైంది. ఇందులో పాయ‌ల్ లుక్ అభిమానుల మ‌తులు పోగొడుతుంది. ఫ‌స్ట్‌లుక్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం కూడా మరో “ఆర్ఎక్స్ 100” మూవీలా ఉంటుంద‌ని అనిపిస్తుంది. కెరియ‌ర్‌లో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ అమ్మ‌డు ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల‌ని సెల‌క్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. “డిస్కోరాజా” చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ ఈ అమ్మ‌డు “వెంకీ మామ‌”లో వెంక‌టేష్‌తో జోడీ క‌ట్టింది. అంతేకాదు ఇటీవలే “సీత” చిత్రంలో స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు కూడా వేసింది.

RDX-Love

Related posts