దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచనాలను అందుకుంటూ ఘన విజయంగా నిలిచింది. ఎమోషనల్‌తో పాటు పలు కామెడీ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఈ సినిమాలో సమంత నటనకు సినీ అభిమానులే కాక సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికి ఈచిత్రం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం విజయంతో జోరు మీదున్న వీరి కాంబో మరోసారి రిపీట్ అవుతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలను కూడా ప్రారంభించినట్లు సమాచారం. దర్శకురాలు నందినిరెడ్డి… ఓ కథను కూడా సిద్ధం చేశారట. ఈ కథను సమంతకు కూడా వినిపించారట. మరి వీరిద్దరిని కాంబోని మరోసారి తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారని అర్ధమవుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
previous post
వారి కోడలు కావడం గర్వంగా ఉంది : ఉపాసన