ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి, ఛార్మి నిర్మాతలు. ఇటీవలే “ఇస్మార్ట్ శంకర్” విడుదల తేదీ వాయిదా పడింది. జూలై 12 నుంచి 18కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. 12న వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతోనే నిర్మాతలు చార్మీ, పూరీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా విషయానికొస్తే టాకీ పార్ట్ పూర్తి, పాటలు, ప్యాచ్ వర్క్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రీకరణలో భాగంగా యూనిట్ చార్మినార్‌కు చేరుకుంది. చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధూమపానం నిషేధం. కానీ ఈ విషయం తెలియని షూటింగ్లో భాగంగా హీరో రామ్ అక్కడ సిగరెట్‌ను కాల్చారు. ఆ ఘటనను ఫోటో తీసిన తర్వాత, బహిరంగంగా సిగరెట్ తాగినందుకు పోలీసులు రామ్‌కు రూ. 200 జరిమానా విధించారు. కోప్టా యాక్ట్ 2003 సెక్షన్ 4 ప్రకారం పోలీసులు రామ్‌కు జరిమానా విధించగా హీరో రామ్ చలానా కట్టారు.
తాజాగా రామ్ ఈ విషయంపై స్పందిస్తూ ఈ ఉదయం “నా టైమూ, పబ్లిక్ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే… షాట్ లా కాల్చినా తమ్మీ, బ్రేక్ లా కాద్. టైటిల్ సాంగ్ లా చూస్తావుగా స్టెప్పు. ఫిర్ భీ లాకి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గుపుడు నువ్వు కూడా నా లెక్క. లైట్ తీస్కో పని చూస్కో… ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్” అని ట్వీట్ చేశాడు. అచ్చమైన తెలంగాణ యాసలో రామ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఇద్దరి మంచి కోసమే విడిపోయాం – విడాకులపై చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు